Sep 22, 2018 @ 13:09 pm
Home / Movies / ఒక్కడు మిగిలాడు మూవీ రివ్యూ..!!

ఒక్కడు మిగిలాడు మూవీ రివ్యూ..!!

చిత్రం : ‘ఒక్కడు మిగిలాడు’

 

దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్ నూతక్కి

నిర్మాతలు: ఎస్ ఎన్ రెడ్డి – లక్ష్మీకాంత్

సంగీతం: శివ నందిగాం

ఛాయాగ్రహణం: రామరాజు

నటీనటులు: మంచు మనోజ్ – అజయ్ నూతక్కి – అనీషా ఆంబ్రోస్ – జెన్నిఫర్ – మిలింద్ గుణాజీ – మురళీ మోహన్ – సుహాసిని – పోసాని కృష్ణమురళి – బెనర్జీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మంచు  మనోజ్.  శౌర్య.. ఎటాక్.. గుంటూరోడు సినిమాలతో వరుసగా అపజయాలు చవిచూసిన మనోజ్ కాస్త గ్యాప్ తీసుకొని  ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఇప్పటికే ఎమోషనల్ ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విశేషాలు చూద్దామా..

కథ :

సూర్య (మంచు మనోజ్) శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థుల్లో ఒకడు. అతను యూనివర్శిటీలో పీజీ చేస్తుంటాడు. శరణార్థుడైన అతడిని ఒక కాలనీ వారు చేరదీసి పెంచుతారు. అయితే అదే కాలనీకి చెందిన ముగ్గురు అమ్మాయిలను మంత్రి కొడుకులు అత్యాచారం చేయాలనుకుంటారు. వీరి కోసం సూర్య పోరాటం మొదలుపెడతాడు. దీంతో అతడిని పోలీసులు హింసించడం మొదలుపెడతారు. ఈ క్రమంలో సూర్యకు ఓ పోలీస్ సహాయం చేయాలనుకుంటాడు…మరోవైపు సూర్యను ఎన్ కౌంటర్ చేయలనుకుంటారు. చివరకు సూర్య ఏమయ్యాడు..? చనిపోయిన ముగ్గురు అమ్మాయిలకు న్యాయం జరిగిందా..?  సూర్య గతం ఏంటీ..అసలు అతను ఎవరు అన్నది అసలు కథ.

విశ్లేషణ:

ఒకప్పుడు తమిళనాడు లో ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని  ఘట్టాలను తీసుకొని దర్శకుడు ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారు. శ్రీలంకలో ఉండే శరణార్థులు తమకు ప్రత్యేకంగా ఒక దేశం కావాలని పోరాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఉన్నదల్లా యాక్షన్ అండ్ సెంటిమెంటే. దర్శకుడు అజయ్ నూతక్కి ఉద్దేశాలు మంచివే కావచ్చు. అతను ఒక జాతి పోరాటాన్ని.. వారి కష్టాల్ని చూపించాలని అనుకున్నాడు. కానీ అతను ఈ విషయాల్ని లోతుగా చూపించడంలో విజయవంతం కాలేకపోయాడు.

సినిమాలో కొన్ని సీన్స్ అద్భుతంగా ఉండగా డ్రమా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇక ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా కాస్త తగ్గింది. టీజర్, ట్రైలర్ లో సినిమా మీద కాస్త అంచనాలు ఏర్పడగా సినిమా మొదలు పెట్టిన విధానం ముగింపు కూడా పొంతనలేకుండా చేశారు.  ఇక  శ్రీలంకలో తమిళుల పోరాటానికి సంబంధించి తమిళంలో ఇంతకుముందే కొన్ని సినిమాలొచ్చాయి. అందులో మణిరత్నం తీసిన ‘అమృత’ కూడా ఒకటి. అందులో మణిరత్నం మరీ లోతుగా ఏమీ శ్రీలంక తమిళుల బాధల్ని.. పోరాటాన్ని చూపించలేదు.

రెండు పాత్రల్లో తేడాను చూపించడానికే మనోజ్ బరువు పెరిగినట్లు అనిపిస్తోంది. ఇక సూర్య పాత్రలో ఓకే అనిపించాడు. అనీషా ఆంబ్రోస్ ఉన్నంతలో ఓకే అనిపించింది. ఇక సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ కూడా విక్టర్ అనే పాత్రలో నటించాడు. ఇక కథ కథనాల్లో అవసరమైన మ్యాజిక్ మాత్రం చూపించలేదు. యాక్షన్ మాత్రమే కోరుకుంటే ప్రథమార్ధం కొంతమేర.. ఓవర్ డోస్ సెంటిమెంటును తట్టుకోగలిగితే ద్వితీయార్ధం కొంత వరకు ఎంగేజ్ చేస్తుంది.కొత్తగా ఉంటుందని మనోజ్ ప్రయత్నించినప్పటికీ సినిమా మాత్రం ఆడియన్స్‌ను ఏమాత్రం ఆకట్టుకోదు. మొత్తం మీద ఈ ‘ఒక్కడు మిగిలాడు’ ఒక విఫల ప్రయత్నం.

నటీనటులు:

మంచు మనోజ్ కాస్త ఎమోషనల్ గా నటిస్తూ ఆకట్టుకున్నప్పటికీ.. అతను బేస్ వాయిస్ తో డైలాగులు చెబుతుంటే ఒక్కోసారి ఇబ్బందిగా అనిపించింది. విధ్యార్ధి నాయకుడిగానే కాదు పీటర్ గా కూడా చాలా బాగా నటించాడు. ఇక సినిమాలో మరో ప్రముఖ పాత్ర అజయ్ ఆండ్రూస్ బాగా నటించాడు. హీరోయిన్ అనీషా పర్వాలేదు అనిపిస్తుంది. పడవ ప్రయాణికుల్లో ఒకడిగా కుమరన్ పాత్రలో కనిపించిన నటుడు బాగా చేశాడు. మిలింద్ గుణాజీ.. పోసాని కృష్ణ మురళి పర్వాలేదు. మురళీ మోహన్.. సుహాసిని మామూలే.

సాంకేతికవర్గం:

శ్రీలంకలో ఉండే శరణార్ధులు ప్రత్యేక దేశం కోసం పోరాడగా వారికి అండగా నిలిచిన ఎల్టిటి చీఫ్ ప్రభాకరణ్ జీవితంలో కొన్ని ఘట్టాలని ఈ సినిమాలో తీసుకున్నాడు. ఇందులో పెద్ద పాటలేమీ లేవు. అన్నీ బిట్ సాంగ్సే. వాటిని కూడా హృద్యంగానే మలిచే ప్రయత్నం చేశాడు. రామరాజు ఛాయాగ్రహణం పర్వాలేదు. కెమెరామన్ కష్టం కనిపిస్తుంది. బడ్జెట్ పరిమితుల వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కొంచెం రాజీ పడ్డ విషయం అక్కడక్కడా కనిపిస్తుంది. సముద్ర ప్రయాణానికి సంబంధించిన సన్నివేశాల్లో కష్టం కనిపిస్తుంది కానీ.. క్వాలిటీ అక్కడక్కడా దెబ్బ తింది.

ప్లస్ పాయింట్స్ : మంచు మనోజ్, ఫోటో గ్రఫి

మైనస్ పాయింట్స్ : సరైన కథనం, ఎంట్రటైన్ మెంట్

చివరిగా : మనోజ్ మరోసాహం మిస్ అయ్యింది..

రేటింగ్ : 2/5

 

Spread the love

About Navitha

Navitha is a professional content writer and writes on Sports, Health and etc.

Check Also

If you are a Salman Khan fan, you must know these about Tiger Zinda Hai’

Bollywood’s star hero Salman Khan is currently acting in ‘Tiger Zinda Hai’ under the directorial …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *