Sep 20, 2018 @ 0:43 am
Home / Movies / Reviews / ‘విజేత’సినిమా : రివ్యూ

‘విజేత’సినిమా : రివ్యూ

నిర్మాణ సంస్థ‌: వారాహి చ‌ల‌న చిత్రం
తారాగ‌ణం: క‌ల్యాణ్‌దేవ్‌, మాళ‌వికా నాయ‌ర్‌
సంగీతం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న రామేశ్వ‌ర్‌
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
క‌ళ‌: రామ‌కృష్ణ‌
చాయాగ్ర‌హ‌ణం: కె.కె.సెంథిల్ కుమార్‌
నిర్మాత‌: ర‌జ‌నీ కొర్ర‌పాటి, సాయికొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్స్‌
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: రాకేశ్ శ‌శి

కథ :
శ‌్రీనివాస‌రావు(ముర‌ళీశ‌ర్మ) స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి. పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకున్న శ్రీనివాస‌రావు కుటుంబ ప‌రిస్థితుల కార‌ణంగా జీవితంలో అడ్జ‌స్ట్ అయిపోతాడు. కొడుకు రామ్‌(క‌ల్యాణ్ దేవ్‌) ఇంజ‌నీరింగ్ చ‌దివినా ఎలాంటి బాధ్య‌త లేకుండా తిరుగుతుంటాడు. రామ్ ఎదురింట్లో జైత్ర‌(మాళ‌వికా నాయ‌ర్‌) అద్దెకు వ‌స్తారు. జైత్రను రామ్ ఇంప్రెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. రామ్ ఏ పని చేసినా ఫెయిల్యూర్ కావడంతో..ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇదే సమయంలో నివాస‌రావుకి గుండెపోటు వ‌స్తుంది. శ్రీనివాస‌రావు త‌ను లేక‌పోతే త‌న కుటుంబం ఏమైపోతుందోన‌ని బాధ‌ప‌డుతుంటాడు. అది చూసిన శ్రీనివాస‌రావు స్నేహితుడు(త‌నికెళ్ల‌భ‌ర‌ణి).. రామ్‌కి శ్రీనివాస‌రావు గురించి నిజం చెప్పి.. కుటుంబానికి తోడుగా నిల‌బ‌డ‌మ‌ని అంటాడు. మరి తండ్రి కోసం రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు..తండ్రిని ఎలా మెప్పిస్తాడు..తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు అన్నదే సినిమా కథ.

విశ్లేష‌ణ‌:
మెగా ఫ్యామిలీ హీరోను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న దర్శకుడు రాకేష్‌ శశి ఆ పనిని సమర్ధవం‍తంగా పూర్తి చేశాడు. కల్యాణ్ పై ఉన్న అంచనాలకు తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. రాకేష్‌ తనదైన టేకింగ్‌ తో మెప్పించాడు. సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంట్ అంత‌టినీ ముర‌ళీశ‌ర్మ క్యారీ చేశాడు. త‌న‌దైన న‌ట‌న‌తో, అనుభ‌వంతో పాత్ర‌కు ప‌రిపూర్ణ‌త తెచ్చాడు. ఇక జ‌య‌ప్ర‌కాశ్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, మాళ‌వికా నాయర్‌, ప్ర‌గ‌తి ఇత‌రుల న‌ట‌న వారి వారి ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. మాళ‌వికా నాయ‌ర్ పేరుకు హీరోయిన్ కానీ… ఆ పాత్ర‌లో న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేదు.హీరో జులాయిగా తిర‌గ‌డం.. తండ్రి బాధ్య‌త‌ల‌ను తెలుసుకోక‌పోవ‌డం వంటి త‌ర‌హా క్యారెక్ట‌ర్ అన్న‌మాట‌. హీరో, అత‌ని ఫ్రెండ్స్ మ‌ధ్య వచ్చే కామెడీ కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా లేదు. ఇక సెకండాఫ్ అంతా హీరో బాధ్య‌త‌గా మెల‌గ‌డం.. తండ్రి కల‌ను తీర్చ‌డానికి కొడుకుగా త‌న వంతు బాధ్య‌త‌ను నేర‌వేర్చ‌డం వాటి సంద‌ర్భానుసారం వ‌చ్చే స‌న్నివేశాలు బావున్నాయి.మేకింగ్‌లోనే కాదు కథల ఎంపికలోనూ వారాహి బ్యానర్‌కు తిరుగులేదని మరోసారి ప్రూవ్‌ చేశారు. హర్షవర్దన్‌ రామేశ్వర్‌ అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్‌ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత ప్లస్‌ అయ్యింది. ఆర్ట్‌, ఎడిటింగ్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటులు :
కళ్యాన్ దేవ్ కి తొలి సినిమా అయినా..విజేతతో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్‌ పరవాలేదనిపించాడు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్‌ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ ఆకట్టుకుంది.ఇక సినిమా మేజర్‌ ప్లస్ పాయింట్‌ మురళీ శర్మ. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు.హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్‌, నోయల్‌, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్‌ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్‌, రాజీవ్‌ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్ : సెంటిమెంట్, క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌ : ఫస్టాఫ్ నేరేషన్, కామెడీ

బాటమ్ లైన్ : ఓ తండ్రి.. ఓ కొడుకు.. ఓ ‘విజేత’

రేటింగ్ : 2.5/5

Spread the love

About Navitha

Navitha is a professional content writer and writes on Sports, Health and etc.

Check Also

Oxygen Review

Telugu movie ‘Oxygen’ is directed by AM Jothi Krishna and produced by S Aishwarya on …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *